బళ్లారి (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 07
బళ్లారి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యకరమైన జీవనం కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రఫీక్ పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం అవసరమని ఆయన తెలిపారు.
బళ్లారి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యకరమైన జీవనం కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రఫీక్ పిలుపునిచ్చారు. బళ్లారి రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన వాయు కాలుష్య నివారణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు అంజినప్ప మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు పాల్గొన్నారు.






