డి. హీరేహాళ్, 5 November
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా డి. మండలం ఓబులాపురం గ్రామంలోని శ్రీ ఓబులాపురం మహాలక్ష్మి అన్నదాన ఆశ్రమంలో 11వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 8వ తేదీ ఆదివారం మహాగణపతి సహస్ర మోదక హవనం, 9వ తేదీ సోమవారం మహా రుద్ర దుర్గా హోమం, 10వ తేదీ మంగళవారం మహా చండీ హోమం, 11వ తేదీ బుధవారం మహా దత్త యాగం ప్రారంభం కానున్నాయి.
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా డి. మండలం ఓబులాపురం గ్రామంలోని శ్రీ ఓబులాపురం మహాలక్ష్మి అన్నదాన ఆశ్రమంలో 11వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా 8వ తేదీ ఆదివారం మహాగణపతి సహస్ర మోదక హవనం, 9వ తేదీ సోమవారం మహా రుద్ర దుర్గా హోమం, 10వ తేదీ మంగళవారం మహా చండీ హోమం, 11వ తేదీ బుధవారం మహా దత్త యాగం ప్రారంభం కానున్నాయి.
రాయదుర్గం నుంచి బళ్లారి వెళ్లే ప్రధాన రహదారిలోని ఓబులాపురం గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామివారి దివ్య అనుగ్రహం పొందాలని ఆశ్రమ నిర్వాహకులు కోరారు.
శ్రీ గురుదేవ దత్త

