అనంతపురం, 16 November
దండోరా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ డా. సామ్రాట్ కే. బి. మధు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుల వ్యవస్థ లేని సమాజం కోసం తన పోరాటంలో మీడియా సహకారం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
దండోరా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ, సాయంకాలిక, చిన్న, వార, దిన పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వివిధ మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు డా. సామ్రాట్ కే. బి. మధు. పశువుల చర్మంతో ప్రపంచ తొలి మీడియాకు నాంది పలికిన నా జాతికి, ప్రస్తుతం మీడియా రంగంలో జాతి పక్షాన తమ సేవలను వివిధ స్థాయిల్లో అందిస్తున్న జంబూద్వీప వారసులకు, మా లక్ష్య సాధనలో అండగా నిలబడ్డ వివిధ సామాజిక వర్గాలకు, పత్రికా యాజమాన్యాలకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే మా పోరాటానికి అండగా నిలబడ్డ ప్రతి పత్రికా యాజమాన్యానికి, సామాజిక అసమానతలను, సామాజిక వివక్షను రూపుమాపి, అందరికీ సామాజిక న్యాయం అందేలా, కుల వ్యవస్థ లేని సమాజం కోసం మేము చేస్తున్న పోరాటంలో మీ వంతు సహకారం ఉండాలని, ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి తరపున జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు డా. సామ్రాట్ కే. బి. మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక ఉద్యమ వందనాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

