आంధ్రప్రదేశ్, 16 November
మీడియా మిత్రులకు, పత్రికా యాజమాన్యాలకు, పాత్రికేయ శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీడియా మిత్రులకు, పత్రికా యాజమాన్యాలకు, పాత్రికేయ శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గమ్యం తెలుగు దినపత్రిక తరఫున సాయంకాల పత్రికలు, చిన్న పత్రికలు, వారపత్రికలు, దినపత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వివిధ మీడియా వేదికల్లో సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నేడు మీడియా రంగంలో వివిధ స్థాయిల్లో సేవలందిస్తూ సమాజానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభివందనాలు. మా లక్ష్య సాధనలో అండగా నిలుస్తున్న వివిధ సామాజిక వర్గాల నాయకులకు, పత్రికల యాజమాన్యాలకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
సామాజిక అసమానతలు, వివక్ష అంతరించి, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం అందేలా, కుల వ్యవస్థ లేని సమసమాజ నిర్మాణం కోసం మేము చేస్తున్న పోరాటానికి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
దేశ నాయకుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం సాగుతున్న మా ప్రయాణానికి మీడియా మిత్రుల సహకారం మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నాను.
కులమతాలకు అతీతంగా సమాజ మార్పునకు మీడియా ఒక ఆయుధం కావాలి. మీ వార్త ప్రజల గొంతుక కావాలి. మీ జర్నలిజం ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేయాలి.
మీ అందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు, జి. గిరి యాదవ్ ఎడిటర్ గమ్యం తెలుగు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ 8722480456, 9480998699

