తెలంగాణలో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ రవాణాపై ఈగల్ () ఫోర్స్ కీలక చర్యలు చేపట్టింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్ మీదుగా కరీంనగర్‌కు ఈ-సిగరెట్లు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసి 31 నిషేధిత ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో చార్మినార్ సమీపంలో బట్టల వ్యాపారం చేస్తూ, కోల్‌కతాలోని సరఫరాదారుతో సంబంధాలు ఏర్పరచుకున్న రాహిల్ ఖాన్ అలియాస్ ఒమర్ (26) అనే వ్యక్తి పేరు బయటపడింది. కొరియర్ సేవలు, వేర్వేరు పేర్లు, మొబైల్ నంబర్ల

