24 నవంబర్ 26 గమ్యం ప్రజాస్వామ్యం వైపు (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 24
శివిని గ్రామ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ, సర్పంచ్ అభ్యర్థి అధికారి సురేష్‌ను మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సర్పంచ్ అభ్యర్థి, మూడు వార్డుల అభ్యర్థులు కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కొమరాడ: శివిని గ్రామ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ, సర్పంచ్ అభ్యర్థి అధికారి సురేష్‌ను మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ పెద్దలు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం సర్పంచ్ అభ్యర్థి, మూడు వార్డుల అభ్యర్థులు కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఓటర్లను తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.
అభ్యర్థి హామీలు
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.
సురేష్ గెలిస్తే గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







