బొమ్మనహాల్ (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 05
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో సుమారు 3,900 మంది ఓటర్లకు గాను 3,000 మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో సుమారు 3,900 మంది ఓటర్లకు గాను 3,000 మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున కొత్తపల్లి బాబురావు, వైఎస్సార్సీపీ తరఫున సి. ఆంజనేయులు పోటీ పడ్డారు.
జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కె. మహేంద్ర, జనసేన తరఫున హీరేసముద్ర గ్రామానికి చెందిన అలివేలు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ తరఫున దేవనగిరి రాజ్‌కుమార్ బరిలో ఉన్నారు.
ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అభ్యర్థులు, కార్యకర్తలు, ఓటర్లలో నెలకొంది. ఈ నెల 7వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.











