అనంతపురం జిల్లా కళ్యాణ మండలంలోని దురద కుంట గ్రామపంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఘంట శశికళ ఘనవిజయం సాధించారు. ఆమె వైయస్సార్సీపి అభ్యర్థి చంద్రకళపై 468 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి.
దురద కుంట పంచాయతీలో మొత్తం 1925 ఓట్లు ఉండగా, 1669 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో ఘంటా శశికళకు 1078 ఓట్లు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి చంద్రకళకు 591 ఓట్లు వచ్చాయి. 26 ఓట్లు నోటాగా నమోదయ్యాయి.
కళ్యాణ లోని జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ ఫలితాలు వెలువడ్డాయి. 468 ఓట్ల మెజార్టీతో ఘంట శశికళ విజయం సాధించారు. ఈ సందర్భంగా దురద కుంట పంచాయతీ పరిధిలోని ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

