Ballari, 2026-11-27
ఈ వార్తకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ ప్రతినెలా రేషన్ తో పాటు టీ పొడి పంపిణీ చేయడం అభినందనీయమని పీఎల్డీ బ్యాంక్ అధ్యక్షుడు దొడ్డ కేశవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బళ్లారిలోని స్థానిక గాంధీ భవన్ లో రెక్సులర్ వెల్ఫేర్ ఫౌండేషన్, గమ్యం తెలుగు దినపత్రిక, ప్రతిభ మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులకు అర కిలో టీ పొడిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మరో ముఖ్య అతిథి, స్వాతంత్ర్య సమరయోధుడు టీజీ విటల్ మాట్లాడుతూ, ఎన్నో సంస్థలు, కంపెనీలను చూశామని, అయితే ప్రతి నెలా సభ్యులకు రేషన్ పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థను ఇప్పుడు తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫౌండేషన్ సేవా విధానాన్ని అభినందించారు.
బళ్లారి ఫ్రాన్స్ చేసి సభ్యుడు వెంకప్ప శెట్టి మాట్లాడుతూ, ఆర్మీ రిటైర్డ్ అధికారి రంజిత్ సింగ్ రాథోడ్ రెక్సులర్ వెల్ఫేర్ ఫౌండేషన్ను స్థాపించి ప్రతినెలా సభ్యులకు టీ పొడి, రేషన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గత ఐదు నెలలుగా నిరంతరంగా రేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, ఈ నెల 120 మందికి టీ పొడి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి సుమారు 200 మందికి రేషన్ పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ప్రతిభ మహిళా మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర మాట్లాడుతూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినెలా రేషన్ అందించే కార్యక్రమానికి మహిళలను కూడా భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 100 మంది మహిళలకు రూ.350 సభ్యత్వం కల్పించి, అన్నపూర్ణ పథకానికి రూ.500 చెల్లించడం ద్వారా 11 నెలల పాటు రేషన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
ప్రతి గ్రామంలో ఈ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, మనం భోజనం చేస్తూ మరో ఇద్దరికి భోజనం పెట్టిద్దాం అనే నినాదంతో మరింత మందిని సభ్యులుగా చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
అలాగే తాను గమ్యం తెలుగు దినపత్రికలో జిల్లా కరస్పాండెంట్ గా కూడా పనిచేస్తున్నానని, ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పత్రిక దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటిని వార్తల రూపంలో ప్రచురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఎల్డీ బ్యాంక్ అధ్యక్షుడు దొడ్డ కేశవరెడ్డి, గాంధీ భవన్ ప్రతినిధి టీజీ విటల్, రిటైర్డ్ అధికారి వెంకప్ప శెట్టి, గమ్యం పత్రిక ఎడిటర్ గిరి యాదవ్, ప్రతిభ మహిళా మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర, ఫారూక్, మట్టా శ్రీనివాసులు, మహాదేవప్ప, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.






