Karnataka, 10 November
బళ్లారి నగర ఆరాధ్య దైవమైన శ్రీ కనకదుర్గ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం మొదటి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
బళ్లారి నగర ఆరాధ్య దైవమైన శ్రీ కనకదుర్గ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా, మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం మొదటి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కుబడి కుంభాలు, బాణాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన భక్తులు, ఆలయ ప్రాంగణంలో కుంభాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన గజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని వెండి ఆభరణాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భగుడి ద్వారాన్ని గుమ్మడికాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.






