బళ్లారి (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 09
బళ్లారి నగరంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.
బళ్లారి: కార్తీక మాసం సందర్భంగా సోమవారం నగరంలోని వివిధ శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
సత్యనారాయణపేట బ్రిడ్జి సమీపంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో అర్చకులు శివలింగానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. కోట మల్లేశ్వర స్వామి ఆలయం, పెద్ద మార్కెట్ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, చిన్న మార్కెట్ మల్లికార్జున స్వామి ఆలయం, బాలాజీనగర్ క్యాంపులోని అమృతేశ్వర స్వామి ఆలయం, పటేల్ నగర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, సత్యనారాయణపేట శనీశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, అనంతపురం రోడ్డులోని అభయ వరద ఆంజనేయ స్వామి ఆలయంలోని శివాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, మహా మంగళహారతితో పాటు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం మహిళలు ఆలయాల వద్ద, ఇళ్ల ముందు కార్తీక దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.






